ఆకట్టుకుంటున్న పెన్షనర్ వినాయకుని థీమ్

20-09-2026 | 05:00am

 నాంపల్లిలోని పెన్షన్ పేమెంట్ ఆఫీస్‌లో విగ్రహ రూపకల్పన

హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): ఉద్యోగుల జీవితకాల సేవకు(Employees lifelong service) గౌరవం, పదవీ విరమణ(Retirement) అనంతరం పెన్షన్(Pension) ద్వారా భద్రత, గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా వినాయకుడి ప్రత్యేక థీమ్‌ను రూపొందించారు. జాయింట్ డైరెక్టర్(Joint Director) ఆధ్వర్యంలోని నాంపల్లి(Nampally)లోని పెన్షన్ పేమెంట్ ఆఫీస్‌(Pension Payment Office)లో ఈ వినూత్న గణేష్ అలంకరణను ఏర్పాటు చేశారు. ‘సేవ పదవీ విరమణ పెన్షన్ భద్రత గౌరవప్రదమైన జీవితం’ అనే భావనను ప్రతిబింబించేలా థీమ్‌ను రూపొందించారు.

సంప్రదాయ భక్తికి ఆధునిక సృజనాత్మకతను జోడిస్తూ పెన్షనర్ల జీవితకాల సేవకు నివాళిగా ఈ అలంకరణను తీర్చిదిద్దారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు ప్రతి పెన్షనర్‌కు శాంతి, ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు. భక్తులను అమితంగా ఆకట్టుకున్న ఈ పెన్షనర్ వినాయకుని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

మరిన్ని వార్తలు