పట్టభద్రుల ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి
బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు సమష్టి కృషి చేయాలి:ఏలూరి వెంకటేశ్వరరావు
మోతె, నవంబర్ 02 (విజయ క్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను(MLC Voter Registration Process) వేగవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు సూచించారు. సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయి కోఆర్డినేటర్లు పట్టభద్రులను నేరుగా కలిసి ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించాలని కోరారు. నిరుద్యోగ యువత సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. అర్హులైన పట్టభద్రులు ఈ నెల 6వ తేదీలోపు ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్‌రెడ్డి, మండల సీనియర్ నాయకులు నూకల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిటిసి కాంపాటి వెంకన్న, సర్పంచ్ మూడ్ నగేష్, సైదులు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.