మద్యం మత్తులో హంగామా.. పోలీసుల విధులకు ఆటంకం

16-09-2026 | 11:02pm

వ్యక్తి అరెస్ట్‌.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలింపు

చివ్వెంల, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మద్యం మత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని చివ్వెంల పోలీసులు అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. చివ్వెంల పోలీస్‌ స్టేషన్‌(Chivvemla Police Station) పరిధిలోని దూరాజ్‌పల్లి వద్ద మద్యం మత్తులో హంగామా సృష్టిస్తున్నట్లు డయల్‌ 100 (112)కు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన దూరాజ్‌పల్లి గ్రామానికి చెందిన షేక్‌ మునీర్‌ (తండ్రి బాబు)పై ఎస్‌ఐ వి. మహేశ్వర్‌ కేసు నమోదు చేశారు. అనంతరం బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు