ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
16-09-2026 | 11:42pm
మునిపల్లి సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మండలంలోని మగ్దుంపల్లి గ్రామానికి చెందిన యేసయ్య అనే లబ్ధిదారుడి ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్(Congress Party Mandal Vice-President Rasul Patel) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు, నాయకులు ఫిరోజ్ ఖాన్, వీరేశం, ఈశ్వరయ్య, వీరన్న, చాంద్ పాషా పటేల్ తదితరులు పాల్గొన్నారు.