ఐదు నెలలుగా అందని వేతనాలు

16-09-2026 | 11:45pm

ఎంపీవోకు వినతిపత్రం అందజేసిన ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు 

​చేగుంట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): చేగుంట మండలం, పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) పరిధిలో పనిచేస్తున్న ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో చేగుంట మండల కేంద్రంలో నిరసన గళం విప్పారు. వేతన సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవోకు కంప్యూటర్ ఆపరేటర్లు వినతిపత్రం అందజేశారు.

మెదక్ జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న 74 మంది ఆపరేటర్లకు ఐదు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు విడుదలయ్యే వరకు ఈ నెల 17 (గురువారం) నుంచి జిల్లా వ్యాప్తంగా సామూహిక సెలవుల్లో వెళ్తున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ వేతనాలు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు