డకౌట్ చేసిన బౌలర్‌కే కోహ్లి గిఫ్ట్.. ఎందుకంటే!

13-11-2026 | 07:49pm

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ మైదానంలో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. ఆట ముగిశాక ఆటగాళ్ల మధ్య గౌరవం, అభిమానం ప్రత్యేకంగా నిలుస్తాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి తన స్పోర్ట్స్‌మన్‌షిప్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ(Matt Henry) చేతిలో డకౌట్ అయినప్పటికీ.. మ్యాచ్ అనంతరం అతడిని అభినందించి తన జెర్సీని బహుమతిగా అందించాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను మాట్ హెన్రీ కుప్పకూల్చాడు. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే ఊహించని షాక్ తగిలింది. హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లో హెన్రీ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టి భారత జట్టు పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి తనను ఇబ్బంది పెట్టిన బౌలర్ ప్రతిభను గుర్తించి అభినందించాడు. అంతేకాకుండా తన జెర్సీని మాట్ హెన్రీకి బహుమతిగా ఇచ్చాడు. ప్రత్యర్థి ఆటగాడి అద్భుత ప్రదర్శనను గౌరవిస్తూ కోహ్లి తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మైదానంలో గెలుపోటములు సహజమని, అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను గౌరవించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మరిన్ని వార్తలు