టార్గెట్ క్లీన్ స్వీప్

17-09-2026 | 05:30am

ఆఫ్గనిస్తాన్‌తో టీ ట్వంటీ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అన్ని విభాగాల్లోనూ సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా 3--0తో సిరీస్ ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్న అఫ్గాన్ జట్టు కనీస పోటీ ఇస్తుందా అనేది చూడాలి.

  1. నేడు ఆఫ్గనిస్తాన్‌తో చివరి టీ20
  2. ఇప్పటికే సిరీస్ భారత్ సొంతం
  3. కనీస పోటీ ఇవ్వని అఫ్గాన్ జట్టు
  4. వైభవ్‌ను ఆడించే ఛాన్స్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : భారత్(India), అఫ్ఘనిస్తాన్(Afghanistan) మధ్య మూడో టీ20 మ్యాచ్(T20 match) గురువారం జరగబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) వేదికగా జరిగే ఈ పోరులో భారత్ ఫేవరెట్. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకుని 2--0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ 7 వికెట్ల తేడాతో ఘనవిజయాలు సాధించిన టీమిండియా.. ఈ చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3--0తో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.

వచ్చే వారం జపాన్‌లో ప్రారంభం కాను న్న ఏషియన్ గేమ్స్‌(Asian Games)కు ముందు ఈ మ్యాచ్ భారత జట్టు(Indian team)కు ఒక మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది. సిరీస్ ఇప్పటికే సొంతమవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లను ఆడించే అవకాశం ఉంది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. అటు అభిమానులు సైతం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కోసం ఎదురు చూ స్తున్నారు. ఒకవేళ వైభవ్ వస్తే సంజూ, అభిషేక్‌లో ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచినా సంజూ శాంసన్ రెండో టీ ట్వంటీలో అదరగొట్టాడు. అటు అభిషేక్ శర్మ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేప థ్యంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు విశ్రాంతినిచ్చి వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. గాయం కారణం గా వరుణ్ చక్రవర్తి సిరీస్ మొత్తానికి దూరం కావడంతో రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి యువ ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్‌ను, అలాగే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

మరోవైపు వరుస ఓటములతో వెనుకబడిన ఇబ్రహీం జద్రాన్ నేతృత్వంలోని అఫ్ఘనిస్తాన్ జట్టు ఈ మ్యా చ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. వారి ప్రధాన బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ గత రెండు మ్యాచ్‌లో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఫాంలోకి రావడం అఫ్ఘాన్కు చాలా కీలకం. రషీద్ ఖాన్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం భారత బ్యాటర్లను అడ్డుకో వడానికి సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగనుంది.

పిచ్ రిపోర్ట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని, చేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్/వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, బుమ్రా/యశ్ ఠాకూర్, అర్ష్దీప్ సింగ్.

అఫ్ఘనిస్తాన్ : ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహమాన్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్.

మరిన్ని వార్తలు