శ్రీచరణి సరికొత్త చరిత్ర

16-09-2026 | 05:25am

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 800 పాయింట్లు 

ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్

రెండో స్థానంలో దీప్తి శర్మ 

దుబాయి, సెప్టెంబర్ 15: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌(ICC T20 Rankings)లో తెలుగమ్మాయి, యువ స్పిన్నర్ శ్రీ చరణి(Shree Charani) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బౌలర్ల ర్యా ంకింగ్స్‌లో 804 రేటింగ్ పాయింట్లు సాధించింది. తద్వారా 800 పాయింట్ల మార్క్ అందుకున్న తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో మరో ఇద్దరు మాత్రమే 800 రేటింగ్ పాయింట్ల మార్కును తాకారు. వీరిలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మేగన్ షట్ (806) అ గ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ స్పిన్నర్ సో ఫీ ఎక్లెస్టోన్ (802) ఉంది. ఇప్పుడు వీరి సరసన శ్రీ చరణి కూడా చేరింది. తాజా ర్యాంకి ంగ్స్‌లో చరణి తన అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది.

ఆసియా కప్ ఫైనల్లో చరణి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఈ ప్ర దర్శనతో టోర్నీలో ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 12కు చేరింది. అలాగే ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనలు చేసిన దీప్తి శర్మ కూడా తాజా ర్యాం కింగ్స్‌లో దూసుకెళ్లింది. టోర్నీ మొత్తంలో 14 వికెట్లు తీసిన దీప్తి.. నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది.

శ్రీలంకతో జరిగిన ఫైనల్లో దీప్తి 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి భారత్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ షఫాలీ ఐదు స్థా నాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకుంది. మరో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్ టాప్ ప్లేస్‌లో ఉండగా, భారత స్టార్ దీప్తి శర్మ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.

మరిన్ని వార్తలు