బ్రెండన్ టేలర్ వరల్డ్ రికార్డు

16-09-2026 | 05:35am

సచిన్ రికార్డు బ్రేక్ 

హరారే, సెప్టెంబర్ 15: జింబాబ్వే వికెట్ కీపర్, బ్యాటర్ బ్రెండన్ టేలర్(Brendan Taylor) చరిత్ర సృష్టించాడు. పురుషుల వన్డే క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘ కెరీర్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న అరుదైన వన్డే రికార్డు బద్దలైంది. సచిన్‌ను వెనక్కి నెట్టి టేలర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌తో ఈ ఘనత అతడి ఖాతాలో చేరింది. సచిన్ వన్డే కెరీర్ 22 ఏళ్ల 91 రోజులు కాగా టేలర్ వన్డే కెరీర్ 22 ఏళ్ల 148 రోజులు.

శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 21 సంవత్సరాల 184 రోజుల వన్డే కెరీర్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2004లో అరంగేట్రం చేసిన టేలర్.. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు జింబాబ్వే సిద్ధమవుతున్న సమయంలో అతడు రీఎంట్రీ ఇచ్చాడు. జింబాబ్వే తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న జింబాబ్వే మూడో బ్యాటర్‌ర్‌గానూ నిలిచాడు.

మరిన్ని వార్తలు