గాంధీ జయంతి వేళ కార్మికులకు గౌరవం

02-10-2026 | 05:16pm

బెజ్జంకి, అక్టోబర్ 2(విజయక్రాంతి): గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికులను(Sanitation Workers) పాలకవర్గం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఉప సర్పంచ్ ధూమాల మహేష్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణలో పంచాయతీ కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. నిత్యం గ్రామ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న కార్మికులను గౌరవించడం ఆనందంగా ఉందన్నారు.

అనంతరం కార్మికులను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు,  కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, కారోబార్ బోనగిరి లక్ష్మణ్, ఆశా, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు