సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కొమ్మూరి

02-10-2026 | 06:03pm

చేర్యాల, అక్టోబర్ 02 (విజయక్రాంతి): చేర్యాల క్యాంపు కార్యాలయంలో జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి(Kommoori Pratap Reddy) 6 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3,42,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్(CMRF) చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వారికి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రజా పాలన లక్ష్యమన్నారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు