గాంధీ, శాస్త్రికి బీజేపీ నేతల నివాళి
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంచిర్యాలలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్( BJP district president Nagunoori Venkateshwar Goud) నాయకులతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత మహాత్మా గాంధీకి దక్కుతుందని తెలిపారు.
స్వాతంత్ర్యం అనంతరం కీలక సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లాల్‌బహదూర్ శాస్త్రి ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో సైనికులు, రైతుల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. దేశ పునర్నిర్మాణానికి ఇద్దరూ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, కార్యక్రమ కన్వీనర్ పట్టి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జోగుల శ్రీదేవి, అక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు.