తప్పిపోయిన చిన్నారిని కన్నవారికి అప్పగించిన ఆర్సీపురం పోలీసులు
రామచంద్రపురం: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీకి చెందిన 4 సంవత్సరాల బాలిక అక్షయ ఈ రోజు ఉదయం 11.00 గంటల ప్రాంతంలో తప్పిపోయినట్లు బాలిక(missing child) తల్లి దండ్రులు డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్(Ramachandrapuram Police Station) పెట్రో మొబైల్ సిబ్బంది అప్రమత్తమై బాలిక కోసం గాలింపు చేపట్టారు.
పోలీసుల వేగవంతమైన చర్యలతో తప్పిపోయిన బాలికను గంటలోపే ఆర్సీ పురం వరుణ్ హాస్పిటల్ సమీపంలోని మెయిన్ రోడ్డుపై గుర్తించారు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రులు పవార్ అంకుష్, పవార్ లక్ష్మి లకు అప్పగించారు. పోలీసుల తక్షణ స్పందనతో బాలికను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంపై వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.