అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
నారాయణఖేడ్, సెప్టెంబర్ 22: ఖేడ్ మున్సిపల్(Khed Municipality) పట్టణంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బతుకమ్మ కుంట వద్ద మహిళల సౌకర్యార్థం ప్రత్యేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి(MLA Sanjeeva Reddy) మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కార్ లు బుధవారం శ్రీకారం చుట్టారు. ఎస్డీఎఫ్ (SDF) నిధులు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్ (మెట్ల) నిర్మాణ ము, మున్సిపల్ పట్టణంలోని 11 వ వార్డులో లో ఓల్టేజ్ సమస్య తీర్చారు. లింక్ రోడ్లను కలిపే రింగ్ రోడ్డుపై విద్యుత్ దీపాల (స్ట్రీట్ లైట్స్) వెలుగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 132 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పండుగ వేళ బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి, ఆడుకోవడానికి వచ్చే ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని రూ. 10 లక్షల నిధులతో పటిష్టమైన మెట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రయాణికులు, ప్రజల రాకపోకలకు కీలకమైన రింగ్ రోడ్డుపై రాత్రి వేళల్లో చీకటి సమస్య లేకుండా విద్యుత్ దీపాలు వెలిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి, సమన్వయం చేసుకుని వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్,b.రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి,షారుఖాన్,మహేష్ చౌహాన్, సుబుర్, మైతాబ్,వివేకానంద, లక్ష్మణ్,కౌన్సిలర్లు, ముంతాజ్ సెట్, మొహీద్ మున్సిపల్ కొ ఆప్షన్ సభ్యులు,పండరి రెడ్డి ఖేడ్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,తాహిర్ అలీ,రామకృష్ణ మాజీ ఎంపీటీసీ,విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.