మాజీ కౌన్సిలర్ నిర్మించిన సి.సి.రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
రామచంద్రపురం విజయక్రాంతి ఆగష్టు 02: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ బి.హెచ్.ఇ.ఎల్ సైబర్ కాలనీ లో మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ 7 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన సి.సి.రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy).
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లలిత సోమిరెడ్డి,మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్,మాజీ కౌన్సిలర్లు,రవీందర్ రెడ్డి,ప్రేమ్, శ్రీశైలం,కాలనీ వాసులు యువకులు తధితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతు ఉమేశ్వర్ తన సొంత నిధులతో నిర్మించిన రోడ్డు పది మందికి ఉపయోగపడే విధానం ఉంటది అని ప్రజలకోసం ఆలోచించే వ్యక్తి ఉమేష్ అని కొనియాడారు.