జీవో నంబర్ 97ను రద్దు చేయాలి

08-09-2026 | 08:02pm

-పటాన్ చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా, నిరసన ర్యాలీ

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్‌ చెరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(Government Polytechnic College) విద్యార్థులు జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ  తో విలీనం చేయడాన్ని, శక్తి పథకం కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University) పరిధిలోకి తీసుకురావడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ వల్ల ఎస్‌బీటీఈటీ ఫ్రేమ్‌వర్క్, ఈసెట్  ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు