ఎస్సీ అభ్యర్థులకు స్వయం ఉపాధి అవకాశాలు
అర్హులకు మంజూరైన యూనిట్లు అందేలా చర్యలు
జిల్లా కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. హరిత(Collector Haritha) తెలిపారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం(Self employment) కింద మంజూరైన యూనిట్ల ఆర్థిక పురోగతిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్(Additional Collector Yuvraj Marmat)తో కలిసి కలెక్టర్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన యూనిట్లు అర్హులైన అభ్యర్థులకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎస్సీ అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సహకార సంస్థ ఈడీ సురేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి అధికారి ఎం. అశోక్, ఎల్‌డీఎం జనార్ధన్, ఎంవీఐ మసూద్ అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.