అనుమతి లేని పార్కింగ్ దాబాలపై చర్యలు తీసుకోవాలి

08-09-2026 | 10:07pm

కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి

జనగామ,(విజయక్రాంతి): జనగామ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం(Jangaon Municipal Council General Meeting)లో మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి పలు సమస్యలను లేవనెత్తారు. డబల్ బెడ్ రూమ్ డ్రా లిస్టు(Double bedroom draw list)లో అనర్హులు ఉన్నారని, పునఃపరిశీలించి అర్హులకు ఇవ్వాలని, తోపుడుబండ్లు పాడైపోయాయని కొత్తవి ఇవ్వాలని, ఎస్ డి ఎఫ్ రూ.5 లక్షలు, రోడ్లు-మోరీల కోసం రూ.1.50 కోటి మంజూరైనా కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని వెంటనే ప్రారంభించాలని కోరారు. మూడో వార్డుకు ఇద్దరు మహిళా సఫాయి కార్మికులను పర్మినెంట్ గా కేటాయించాలని, ప్రైవేట్ చెత్త బండిని బంద్ చేసి ప్రభుత్వ వాహనం పంపాలని, ఖాళీ ప్లాట్లలో చెత్త తొలగించేలా నోటీసులు ఇవ్వాలని, గార్లకుంటను పార్కుగా అభివృద్ధి చేయాలని, అనుమతి లేని పార్కింగ్ లు, దాబాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు