రైతుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే

15-09-2026 | 02:34pm

మాడ్గులలో స్ప్రింక్లర్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

​మాడ్గుల,సెప్టెంబర్ 15(విజయక్రాంతి): మాడ్గుల మండల కేంద్రంలోని ఎంపీడీవో(MPDO) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, లబ్ధిదారులైన రైతులకు స్ప్రింక్లర్ పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ సర్పంచుల ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రామ్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించడానికి స్ప్రింక్లర్ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంపిణీ అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. 

సమీక్ష సమావేశంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, వివిధ సంక్షేమ పథకాల అమలుతీరుపై అధికారులతో ఎమ్మెల్యే విస్తృతంగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు