వినాయక నిమజ్జనం
భక్తిశ్రద్ధలతో పూజలు.. ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం
పెద్దపల్లి,(విజయ క్రాంతి): పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్(Peddapalli Rural Police Station)లో ఏర్పాటు చేసిన వినాయకుడికి మూడు రోజుల పాటు పోలీసు సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువారం వినాయక విగ్రహాన్ని పట్టణంలోని ఎల్లమ్మ చెరువుకు తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ లు మధుకర్, శ్వేత మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను(Vinayaka Chavithi Festival) పోలీస్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నామని, విఘ్నాలు తొలగించి ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించామని, పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించడంతో పాటు పండుగ సమయంలో భక్తి భావంతో పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రజలు కూడా పండుగలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్ఐ మధుకర్ కోరారు.