చేతివృత్తిదారులకు ప్రతీక విశ్వకర్మ

17-09-2026 | 09:11pm

గద్వాల, సెప్టెంబర్ 17: శిల్పులు, చేతివృత్తిదారులు, కార్మికులకు భగవాన్ విశ్వకర్మ ప్రతీకగా నిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి(A.P. Jitender Reddy) అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐడీఓసీ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకతకు గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు