మహిళ కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్టు, రిమాండ్
17-09-2026 | 09:31pm
గణపురం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మహిళను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని గణపురం పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ బోరగల అశోక్(SI Boragala Ashok) కథనం ప్రకారం గణపురం మండల కేంద్రానికి చెందిన తరాల చక్రి, ఇదే గ్రామానికి చెందిన తిప్పని మాధురి, బాలకృష్ణ భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు తరాల చక్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరించి, నిందితుడిని విచారించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు గణపురం ఎస్‌ఐ అశోక్ తెలిపారు.