పారమిత విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
ముకరంపుర, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కరీంనగర్ అర్బన్ పాఠశాల క్రీడా సమాఖ్య(Karimnagar Urban School Sports Federation) ఆధ్వర్యంలో ఇటీవల రేకుర్తిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీలో నిర్వహించిన ఖో-ఖో ఛాంపియన్‌షిప్, అలాగే కోట విద్యాసంస్థలో నిర్వహించిన వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పారమిత హెరిటేజ్ పాఠశాల(Paramita Heritage School) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కరీంనగర్ అర్బన్ అండర్-14 బాలుర విభాగంలో ఖో-ఖో, వాలీబాల్ పోటీల్లో స్థానిక నగరంలోని పద్మనగర్, పారమిత హెరిటేజ్ పాఠశాల ప్రథమ స్థానాన్ని సాధించింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపికృష్ణ తెలిపారు.
ఈ విజయంతో ఆరుగురు పారమిత విద్యార్థులు ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 70వ ఎస్.జి.ఎఫ్.ఐ. అండర్-14 కరీంనగర్ జిల్లా స్థాయి బాలుర ఖో-ఖో, వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారని తెలియజేశారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డా. ఇ. ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం. ప్రసాద్, కె. హన్మంతరావు ప్రత్యేకంగా అభినందించి విద్యార్థులు జిల్లా స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.