రుణ లక్ష్యాలు సాధించాలి

17-09-2026 | 09:28pm

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను గడువులోగా సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,990.50 కోట్ల రుణ లక్ష్యం కాగా, తొలి త్రైమాసికంలో రూ.1,366.47 కోట్లు మాత్రమే రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. ముఖ్యంగా గృహ, ఎంఎస్‌ఎంఈ, విద్యా రుణాలపై దృష్టి సారించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉదారంగా గృహ రుణాలు అందించాలని, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, బీమా పథకాలను 100 శాతం అందించాలని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ, ఆర్సెటి ద్వారా యువతకు శిక్షణ, ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు