దైవ సన్నిధిలో దివ్యమైన సేవలు అందిస్తాం

30-09-2026 | 03:12pm

శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ అధ్యక్షుడు వంగల తిరుమలేష్

మంథని, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): శ్రీ లక్ష్మీనారాయణ దైవ సన్నిధిలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు వంగల తిరుమలేష్(Vangala Tirumalesh, the new president) అన్నారు. ఇటీవల ఆలయ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన తిరుమలేష్‌ను హిందుత్వ శ్రేష్ఠ వర్ధని, మంథని విద్యార్థి యువత సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ అధ్యక్షుడు కొండేల మారుతి మాట్లాడుతూ ఆధ్యాత్మిక శక్తి, సంపద మేళవించిన మంత్రపురి మంథని భక్తి చరిత్రలో శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం ధార్మిక స్రవంతిని నిరంతరం కొనసాగిస్తోందన్నారు. మంథని గడ్డకు ఉన్న పవిత్ర ప్రశస్తిని కాపాడుతూ, రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అండదండలతో సేవా కార్యక్రమాల్లో తగిన భూమిక పోషిస్తామని తెలిపారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వంగల తిరుమలేష్‌ను యువత, విద్యార్థులు, హిందుత్వ శ్రేయోభిలాషులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు