పారమిత ఉన్నత పాఠశాలలో జీవవైవిధ్య అవగాహన కార్యక్రమం

30-09-2026 | 04:04pm

కొత్తపల్లి, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): స్థానిక  పారమిత ఉన్నత పాఠశాలలో(Local Paramitha High School) సుస్థిరత – జీవవైవిధ్య పరిరక్షణ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమమును  ఘనంగా నిర్వహించారు.విద్యార్థులలో  పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పాఠశాల ప్రధానోపాద్యాయులు పి. ప్రశాంత్  తెలిపారు.ప్రాజెక్ట్ హెడ్, ఎకో క్లబ్ మెంటార్లు  లలిత్ మోహన్ సాహు, అనిల్ మార్గదర్శకత్వంలో 8వ తరగతి విద్యార్థులు కె. ఆరుష్, ఎం. ఆదిష్, ఈ. రితీష్, ఎ. శ్రీ వర్ధన్, జె. సాయి సాన్హిత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జీవవైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యత, సహజ వనరుల సంరక్షణ, ప్రకృతిలోని అన్ని జీవరాశులతో సహజీవనం చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ విద్యార్థులు వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు. జీవవైవిధ్య వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, పోస్టర్ తయారీ, మొక్కల పెంపకం, నినాదాల రచన, జీవవైవిధ్య సేకరణ తదితర పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు  ప్రశాంత్ మాట్లాడుతూ, జీవవైవిధ్యమే భూమిపై జీవానికి పునాదిగా ప్రతి విద్యార్థి ప్రకృతి సంరక్షకుడిగా మారాలని, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని దిశా నిర్దేశం చేశారు. జీవవైవిధ్యంపై ఆలోచనాత్మక సందేశం, జీవవైవిధ్య థీమ్ సాంగ్, అటవీ నిర్మూలన మరియు కాలుష్య దుష్పరిణామాలను తెలియజేసే నాటిక, ప్రకృతి మానవ సంబంధాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

జీవవైవిధ్య వారోత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులను   పాఠశాల అధినేత డా. ఇనుగంటి ప్రసాద్ రావు   ప్రత్యేకంగా అభనందించారు. పారమిత పాఠశాలల డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్ రావు, వినోదరావు, వి. యు. యం. ప్రసాద్,  హనుమంత రావు,  ప్రధానోపాధ్యాయులు  ప్రశాంత్, బాలాజీ,కవితప్రసాద్, సమన్వయ కర్తలు  శ్రీనాథ్, చంద్రసేన, ఉపాధ్యాయులు   విద్యార్థుల చొరవను అభినందించారు.

మరిన్ని వార్తలు