సుల్తానాబాద్‌లో గణేశుడికి మహా నైవేద్యం
234 నైవేద్యాలు సమర్పించిన భక్తులు
గణేశుడు వద్ద ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఆది దేవుడైన గణేశుడికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు, 234 రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిని చాటుకున్నారు, గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత వాడలో గల శ్రీ శివాలయం లో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు ఆలయ అర్చకు లు వల్ల కొండ మఠం రమేష్ , మహేష్ లు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరికీ మంచి జరగాలని ఆ గణేష్ ని వేడుకోవడం జరిగిందన్నారు, ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయ రమణారావు కు శాలువాయి కప్పి ఘనంగా సన్మానించారు, ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే విజయరమణారావు వెంట మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు తో పాటు పలువురు ఉన్నారు.