రైతులకు 24 గంటల ఉచిత కరెంటుకు చర్యలు
నిర్మల్,(విజయక్రాంతి): ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ ఎంపీడీఎల్ పర్యవేక్షత ఇంజనీర్ బి రమేష్, డివిజనల్ ఇంజనీర్ నాగరాజు తెలిపారు. (సుమారు 80MW). ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ లోడ్(Agricultural electrical load) అధికంగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో లో-వోల్టేజీ సమస్య ఏర్పడుతుందన్నారు. సమస్యను అధిగమించేందుకు పవర్ ట్రాన్స్ఫార్మర్ ట్యాప్ పొజిషన్ను పెంచే సమయంలో, నిర్మల్లోని 132/33 KV SS అక్కాపూర్ వద్ద ఉన్న 50,000 KVA పవర్ ట్రాన్స్ఫార్మర్ సాంకేతిక కారణాలతో చెడిపోయింది అన్నారు. దీని విలువ నాలుగు కోట్లు ఉంటుందన్నారు.
ప్రస్తుతం అక్కాపూర్ 132/33 KV సబ్స్టేషన్లో అందుబాటులో ఉన్న మరో 50,000 KVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నాము. అయితే ఒకే పవర్ ట్రాన్స్ఫార్మర్ పై అధిక లోడ్ ఉన్నందున, రైతులకు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. ఈ సమస్యను రెండు రోజుల పరిష్కరించి రైతులకు 24 గంటల వ్యవసాయ కనెక్షన్లను విద్యుత్ సరఫరా అందజేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.