పోలీసుల తనిఖీలు..పెండింగ్ చలాన్లపై కొరడా!

13-09-2026 | 05:47pm

నిర్మల్ సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని  బైపాస్ వద్ద ఆదివారం పోలీసులు ముమ్మరంగా వాహనా వాహనాలనురూరల్ సీఐ కృష్ణ(CI Krishna) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.  రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించారు. పెండింగ్ చలాన్లను తనిఖీ చేసి జరిమానాలు వసూలు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో రూరల్ ఎస్సై లింబాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు