కన్కల్ రామాలయంలో చోరీ
13-09-2026 | 04:51pm
రూ. 8 వేల నుంచి 10 వేల నగదు అపహరణ
తాడ్వాయి,సెప్టెంబర్,13( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి(Tadwai) మండలం కన్కల్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రామాలయంలో చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాలయానికి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టి ఆలయం హుండీలో ఉన్న నగదు రూ.8 వేల నుంచి 10 వేల వరకు అపహారించుకుపోయినట్లు వారు తెలిపారు.
ముందుగా గుట్టపై ఉన్న మెహర్ బాబా ఆలయం వద్దకు వెళ్లి ఆలయం పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ తాళాన్ని పగలగొట్టి అందులో ఉన్న సెల్ ఫోన్ ను తీసుకువెళ్లారు. గెస్ట్ హౌస్ నుంచి పొడవైన కూర వండే గరిటెను తీసుకుని వెళ్లి రామాలయం తాళాన్ని పగలగొట్టినట్లు వారు తెలిపారు. ఈ విషయమై తాడ్వాయి పోలీసులకు గ్రామస్తులు ఆదివారం ఫిర్యాదు చేశారు.