పెండింగ్ వేతనాలు చెల్లించాలి
12-10-2026 | 10:38pm
బైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రామపంచాయతీలో పనిచేస్తున్న వర్కర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్(Gram Panchayat Workers' Union) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ నేపథ్యంలో పెండింగ్ వేతనాలను చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ కు వినతి పత్రాన్ని అందించారు. గ్రామ పంచాయతీ వర్కర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.