గ్రామాల అభివృద్ధికి కృషి
కుబీర్ (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Ramarao Patel) అన్నారు. శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలో VDC ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో VDC ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.