గాయత్రిపురానికి భక్తుల పాదయాత్ర
12-10-2026 | 08:23pm
నిర్మల్,(విజయక్రాంతి): సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ దుర్గామాత భక్తులు దుర్గా నవరాత్రి ఉత్సవాలను(Durga Navratri celebrations) మహా పాదయాత్ర నిర్వహించారు. గ్రామంలో పూజలు నిర్వహించిన అనంతరం లోకల్ వెల్మల్ నుండి నిర్మల్ పట్టణంలోని గాయత్రి పురం గాయత్రీ మాత ఆలయం(Gayatri Mata Temple) వరకు పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాత్రి గంగయ్య భక్తులు పాల్గొన్నారు.