జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సినీ హీరో శ్రీ విష్ణు
12-10-2026 | 08:57pm
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
అలంపూర్: తెలంగాణలోని ప్రసిద్ధ ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ సినీ హీరో శ్రీ విష్ణు సోమవారం దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల వేళ అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఆయన భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.సినీ హీరో శ్రీ విష్ణు ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.