క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
ముకరంపుర,(విజయక్రాంతి): యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో రేకుర్తిలో నిర్వహిస్తున్న సుధగోని నర్సయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్(Sudhagoni Narsaiah Memorial Cricket Tournament)ను 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి–కృష్ణ గౌడ్(Corporator Sudhagoni Madhavi-Krishna Goud) ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
యువ క్రీడాకారులు(Young athletes) క్రీడాస్ఫూర్తితో ఆడి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.రేకుర్తిలోని రాజశ్రీ ఫంక్షన్ హాల్ సమీపంలోని SVJC కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో విజేత జట్టుకు రూ.20,000, రన్నరప్ జట్టుకు రూ.10,000 నగదు బహుమతులు అందజేయనున్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు,మునీర్ ఖాన్.మెరజ్.క్రీడాకారులు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.