శాంతిభద్రతలే లక్ష్యం
12-10-2026 | 09:35pm
రఘునాథపల్లి ఎస్ఐగా భరత్
జనగామ,(విజయక్రాంతి): రఘునాథపల్లి పోలీస్ స్టేషన్(Raghunathapalli Police Station) సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎం.భరత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు జనగామలో విధులు నిర్వహించిన ఆయన, నరేష్ యాదవ్ బదిలీతో రఘునాథపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ భరత్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు.