విద్యారంగ సమస్యలపై రాజులేని పోరాటం

19-09-2026 | 06:15pm

కుబీర్, (విజయ క్రాంతి): ఉపాధ్యాయుల, విద్య హక్కుల పరిరక్షణ(Protection of Educational Rights)లో ఎస్టియు కీలక పాత్ర పోషిస్తుందని ఎస్టీవీ జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్(STV District President Bhumanna Yadav) అన్నారు.  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రియదర్శిని నగర్ లో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర (STUTS) 80 వసంతాల వైభవోత్సవాల గోడ ప్రతులను  విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్.టి. యు.టి.ఎస్.‌ స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడి ఎనిమిది  దశాబ్దాలుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, సర్వీస్ నిబంధనలు, మొదటి పి. ఆర్.సి,  డి.ఏ.ల సాధన, అప్రెంటిషిప్ విధానం రద్దు తదితర హక్కుల సాధన, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ  కోసం నిరంతరం ప్రయత్నిస్తూ, విద్యారంగ సమస్యల సాధనకు, విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఎస్. టి.యు. ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగోల్ శుభం కన్వెన్షన్ లో నిర్వహించనున్న ఎస్.టియు.టి.ఎస్.80 వసంతాల వైభవోత్సవాలకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు, నిర్మల్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, ఖలీద్ హైమద్, జిల్లా కార్యవర్గ సభ్యులు శివలింగయ్య, ఇంతియాజ్ హైమాద్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు