అరాచక పాలన

21-09-2026 | 05:45am

సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు

  1. రైతు సమస్యలను గాలికి వదిలిన ప్రభుత్వం 
  2.   22ఏ జాబితాలో భూముల కోసం పోరాడుతాం
  3. ఇరవై నాలుగు గంటల కరెంటు ఎక్కడిస్తున్నారో చూపాలి 
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి)/ఆలేరు: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఎల్ నినో(El Nino) కంటే సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రమాదకరంగా మారారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) మోటకొండూరులో హరీశ్ సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. మోటకొండూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌(Motakonduru Electricity Substation)ను ఆయన సందర్శించారు. విద్యుత్ సరఫరా(Power supply), కోతలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్‌లో ఉండాల్సిన లాగ్ బుక్ కనిపించకపోవడంపై హరీశ్ తీవ్రంగా స్పం దించారు.

అనంతరం నిర్వహించిన సభ లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో చేరికలతో మళ్లీ రాష్ట్రంలో పార్టీ గెలుస్తోందని ప్రజల్లో నమ్మకం వచ్చిందన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పాలకులు గాలికి వదిలేశారన్నారు. కరెంట్‌లో వోల్టేజీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇచ్చి రైతులను కేసీఆర్ ఆదుకుంటే.. రైతుబంధు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతుబీమా ఇవ్వడం లేద నీ, యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రేవంత్ రెడ్డి అరాచక పాలన వచ్చింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెం ట్ ఇవ్వడానికి ఇష్టం లేక కరెంట్ కోతలు పెడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు లాగ్ బుక్‌లు చూడడం లేదని ప్రశ్నించారు. కరెంటు కోతల వాస్తవాలు బయటపడతాయని సబ్ స్టేషన్‌లో లాగ్‌బుక్ మాయం చేశారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెపుతున్నప్పుడు సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్‌ను చూపించడానికి ఎందుకు భ యపడుతున్నారని ప్రశ్నించారు. స్థానిక కాం గ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎం పీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు మాని సబ్‌స్టేషన్లు సందర్శించి క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని సూ చించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు ఎల్ నినో ప్రభావం వల్ల కాదని, కాంగ్రెస్ ప్రభు త్వ అసమర్థత వల్లే వచ్చిందని విమర్శించారు.

అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్ల అంశం పై స్పందిస్తూ సీఎం సోదరుడు, విప్ మహే ందర్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇళ్ల అంశాలను కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల నుంచి దృష్టి మళ్లించేందుకే త మపై డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

అజీజ్‌నగర్ భూములను 12 ఏళ్ల క్రితమే ఐటీ రిటర్స్‌లో చూపించామని తెలిపారు. 22ఏలో మోటకొండూరు, ఆలే రు, భువనగిరి భూములు కూడా పెట్టారని, నిషేధిత జాబితాలో పెట్టిన భూముల గురిం చి మేం కొట్లాడిన, ప్రజా సమస్యల గురించి పోరాడినా కేసులతో వేధించాలని చూస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. ఉద్యమం చేసి వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు కేసులకు,  బెదిరింపులకు భయపడరన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై చిన్న చూపు..

కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను చిన్న చూపు చూస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్ పథకా ల మోటార్లు పూర్తిస్థాయిలో నడపడం లేద ని ఆరోపించారు. మోటార్లు సక్రమంగా నడిపితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సాగునీ రు అందించే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీటిని తరలిస్తున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఆంధ్ర ప్రాంత రైతులకు పుష్కలంగా నీరు అందుతుంటే.. తెలంగాణ రైతులకు మాత్రం సరిపడా నీరు అందడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, భిక్షమయ్యగౌడ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగ య్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, తుంగ బాలు, విద్యాసాగర్, ధర్మేం ద్ర, ఎర్రోళ్ల శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, మం డల పార్టీ అధ్యక్షుడు బొట్ల యాదగిరి, వస్ప రి శంకయ్య, కర్రె అశోక్, కందుల శంకర్, జంపాల దశరథ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు