4 September, 2026 | 10:58 PM

Breaking News

నాకు మంత్రి పదవిపై.. అధిష్ఠానం నిర్ణయమే అంతిమం

04-09-2026 | 06:00am
  1. రాహుల్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. ఆయనను ప్రధాని చేయడమే లక్ష్యం 
  2. ముఖ్యమంత్రి సహకారంతో మునుగోడు అభివృద్ధి 
  3. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్ 3 (విజ యక్రాంతి): తనకు మంత్రి పదవి(Ministerial post) కేటాయించడంపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, కాంగ్రెస్ పార్టీ(Congress party) కోసం పదేళ్లుగా శ్రమించిన కార్యకర్తలకు తగిన న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy) అన్నారు. గురువారం సంస్థాన్ నారాయణపురం మండలం(Samsthan Narayanapuram Mandal)లో సుమారు రూ.117 కోట్ల ఆర్ అండ్ బీ నిధుల(R&B funds)తో మంజూరైన పలు గ్రామాల రోడ్ల అభివృద్ధి(development of village roads) పనులకు సర్వేలు గ్రామంలో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి కే టాయించడంలో అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాహుల్‌గాంధీపై తనకు నమ్మకం ఉన్నదని, ఎవరికి ఏ పదవి కేటాయించాలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే కాంగ్రెస్ ప్రతి కార్యకర్త లక్ష్యమని అన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలన్నీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.

పదేళ్లు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన కార్యకర్తను కంటికి రెప్పల కాపాడుకుం టానని అన్నారు. వారికి పదవుల పరంగా ఆర్థికంగా ఉపాధిపరంగా న్యాయం జరగాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తన సోదరుడు వెంకట్‌రెడ్డి సహకారంతో మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 60 డబుల్ రోడ్లలో 13 రోడ్లు మునుగోడు నియోజకవర్గానికి కేటాయించినట్లు తెలిపారు. 6 నెలలో ప్రతి గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.