మానవత్వం చాటుకున్న సంక్షేమ అధికారి

22-09-2026 | 10:38am

ఒకే కుటుంబంలో ముగ్గురు వికలాంగులు 

టాయిలెట్ సైకిల్లు అందజేత 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): ప్రభుత్వం జీతం ఇస్తోంది.. ఏదో మన పని చేసుకుని పోదాంలే... ఎవరు ఎటు పోతే మనకేంటి... చేసిన పనికి ప్రతిఫలం ఆశించే ఈ రోజుల్లో కొంతమంది అధికారులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా సంక్షేమ అధికారిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వికలాంగులున్నారని, వారికి సంక్షేమ పథకాలు అందించడం తమ శాఖ బాధ్యతగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే ఇల్లంద మండలం రాగబోయిన గూడెం(Ragaboyna Gudem) గ్రామానికి చెందిన ఈసం కన్నమ్మ కుటుంబంలో ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్కు విన్నవించుకునేందుకు వృద్ధురాలైన ఆమె తన అంగవైకల్యం కలిగిన పిల్లలతో కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. పరిస్థితి తెలుసుకున్న జిల్లా సంక్షేమ అధికారి లెనినా వారని తన ఛాంబర్ లోకి పిలిపించి రెండు టాయిలెట్ సైకిల్లను అందజేశారు. త్వరలో వీల్ చైర్లను పంపిణీ చేస్తానని హామీ ఇవ్వడంతో కన్నమ్మ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు