హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం చెక్కు అందజేసిన సీపీ
హనుమకొండ, జూలై 29(విజయ క్రాంతి):ఆకస్మికంగా మర ణించిన హోంగార్డ్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపిఎస్ చేతుల మీదుగా ఐదు లక్షల ఆర్ధిక సాయం చెక్కును బుధవారం సీపీ కార్యాలయంలో అంద జేశారు. రాష్ట్ర పోలీస్ శాఖకు సహా య సహకారాలను అందిస్తున్న హోంగారడ్స్ ఆకస్మికంగా గాని లేదా ప్రమాదాల్లో మరణిస్టే సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని, మరణించిన హోంగారడ్స్ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించాలని రాష్ట్ర పోలీస్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ గత ఏడాది ఆకస్మికంగా మరణించిన పి. శ్రీనివాస్ రెడ్డి భార్యకు పోలీస్ కమిషనర్ ఆర్థిక చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎ.ఆర్ అదనపు డీసీపీ శ్రీనివాస్, హోంగారడ్స్ ఆర్ ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.






