ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి: ప్రధాని మోడీ

13-09-2026 | 11:59am

బ్రిక్స్ దేశాలు.. సుస్థిరాభివృద్ధి సాధించాలి

మానవాళి వికాసానికి బ్రిక్స్ దేశాలు కృషి

భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలం

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఆవేదన వ్యక్తం చేశారు. 18th BRICS Summit లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.... ఉద్రిక్తతల వల్ల సామాన్య ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు ఒకే ప్రాంతానికి పరిమితం కాదన్న ప్రధాని మోదీ సవాళ్లను సకాలంలో గుర్తించడం, చర్యలు తీసుకోవడం ముఖ్యమని వివరించారు. అంటువ్యాధులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై ఏకాభిప్రాయం కుదిరిందని స్పష్టం చేశారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని తెలిపారు.

మానవాళి వికాసానికి బ్రిక్స్ దేశాలు(BRICS Nations) కృషి చేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించాలని పీఎం మోదీ ఆకాంక్షించారుచైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో సహా ఆ కూటమికి చెందిన అగ్రనేతల సమక్షంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు