ఎలాన్ మస్క్.. భారత్‌ను శాసించలేవ్

17-10-2026 | 05:10am
  1. ప్రధాని మోదీని రాజకీయంగా వ్యతిరేకిస్తాం
  2. దేశంపై విదేశీ వ్యాపారవేత్తల పెత్తనం మాత్రం అంగీకరించబోం
  3. స్టార్లింక్ వివాదంపై ఎంపీ అసదుద్దీన్
  4. జాతీయవాదంపై ఎంఐఎం అధినేత కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi)ని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారతదేశ నిర్ణయాలను విదేశీ వ్యాపార వేత్తలు శాసించడాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MIM chief Asaduddin Owaisi) స్పష్టం చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ అయిన ఎలాన్ మస్క్ భారత దేశాన్ని శాసించలేవని అన్నారు. దేశ రాజకీయ, వ్యాపార నిర్ణయాల వెనుక ఉన్న అధికారాన్ని ఎలా ప్రశ్నిస్తావని నిలదీశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని ఉద్దేశించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పట్ల తన వ్యతిరేకత అంటే భారత దేశ రాజకీయ అధికారాన్ని ప్రశ్నించే బయటి వ్యక్తి ‘గోరా (తెల్లవాడిని)’కి మద్దతు ఇవ్వడం కాదని స్పష్టంచేశారు. తాము ఎప్పుడూ మోదీకి వ్యతిరేకంగానే ఉన్నాం. ఇకపైనా అలాగే ఉంటాం. అయితే, భారత ప్రధానిని ఉద్దేశించి ఎలాన్ మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగల రు? అని ప్రశ్నించారు.

భారతదేశ ఇంధన ఎంపికల విషయంలో అమెరికా ఒత్తిడిలో తాను చూస్తున్న వైరుధ్యాన్ని కూడా ఆయన ప్రస్తావిం చారు. రష్యా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని వాషింగ్టన్ న్యూఢిల్లీని కోరిందని , అయితే అమెరికా మాత్రం రష్యా ఇంధన ఉత్పత్తులను కొనసాగిస్తోందని ఒవైసీ వాదించారు. దేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి అనుమతుల్లో జాప్యం జరుగుతోందంటూ మస్క్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఈ క్రమంలో ముఖేష్ అంబానీని ఉద్దేశించి ‘భారత దేశానికి అసలైన బాస్ ఆయనేనా?’ అంటూ ప్రశ్నించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ.. బీజేపీ, ప్రధాని మోదీ తరచూ జాతీయవాదాన్ని ప్రస్తావిస్తుంటారని, అలాంటప్పుడు ఒక విదేశీ వ్యాపారవేత్త మన దేశ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఎందుకు గట్టిగా స్పందించడం లేదని నిలదీశారు. తెల్లవారి పట్ల బీజేపీ ప్రభుత్వం భయపడుతోందా? అంటూ విమర్శిం చారు. ‘ఈ తెల్లవా డు కూర్చుని మనకు ఆదేశాలు ఇస్తాడా?’ అని అతను నిలదీశారు.

మన దేశ వనరుల వినియోగం, ఆర్థిక విధానాలపై నిర్ణయాలు తీసుకునే హక్కు దేశానికే ఉండాలని ఒవైసీ పేర్కొన్నారు. విదేశీ ఒత్తిళ్ల కారణంగా భారత పౌరుల ప్రయోజనాలకు నష్టం కలగ కూడదని పేర్కొన్నారు. మరోవైపు, మస్క్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు ఉపయోగించుకు న్నారు. దీంతో ఒకే వివాదంపై ఒవైసీ, రాహుల్ గాంధీ స్పందనలు భిన్నంగా ఉన్నాయి. అయితే రిలయన్స్ సంస్థ స్టార్‌లింక్‌తో సహా శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపింది.

మరిన్ని వార్తలు