బీసీని ముఖ్యమంత్రి చేస్తాం
- బీసీలు తమ ఓట్లతో తామే అధికారంలోకి రావాలి
- జూపల్లి రాజకీయ చరిత్ర బయటపెడతా..
- టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న
పెద్దకొత్తపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): 2028లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని అధికార పీఠంపై కూర్చోబెట్టడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) ప్రధాన లక్ష్యమని తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, ఇకపై బీసీలు ఇతరులకు అధికారం అప్పగించే పరిస్థితి మారాలని, తమ ఓట్లతో తామే అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
కొల్లాపూర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెడ్డి,వెలమల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర శుక్రవారంతో 30వ రోజుకు చేరుకుంది. గోల్కొండ ఖిల్కొండ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సుమారు 750 కిలోమీటర్లు పూర్తి చేసుకుని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చేరుకుంది.
మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మల్లన్న, సెంటర్లో నిర్వహించిన భారీ కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా సాగుతున్న రెడ్లు, రావుల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలుకుతామని, జూపల్లి కృష్ణారావు రాజకీయ చరిత్రతోపాటు ఆయన హయాంలో జరిగిన అక్రమాలు,హత్యలన్ని ప్రజల ముందు ఉంచుతామని మల్లన్న హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మలన్న తీవ్ర విమర్శలు గుప్పించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఐదేళ్లలో బీసీల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడంలో ప్రభుత్వం వి ఫలమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ రజిని యాదవ్, జిల్లా అ ధ్యక్షుడు ఆంజనేయులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అశోక్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, మండల అధ్యక్షుడు నిరంజ న్,ప్రధాన కార్యదర్శి రాము యాదవ్, శైల జ, అనపడి లక్ష్మయ్య,గణేష్ తదితరులున్నా రు.