వేములవాడలో వైభవంగా సద్దుల బతుకమ్మ

17-10-2026 | 05:55am

అంబరాన్ని అంటిన సంబురాలు 

రంగురంగుల పూలతో బతుకమ్మలు

ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

వేములవాడ అక్టోబర్ 16 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో శుక్రవారం సద్దుల బతుకమ్మ పండుగ(Saddula Bathukamma Festival)ను వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ సంబురాలు అం బరాన్ని అంటాయి. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించడంతో వేములవాడలో పండుగ వాతావరణం నెలకొంది.  మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపా టలతో సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ‘ఆడుదాం పాడుదాం గౌరమ్మ’ అంటూ మహిళలు బతుకమ్మ పాట ఆలపిస్తూ.. బొడ్డెమ్మ కొడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించారు. అనంతరం బతుకమ్మ లను నిమజ్జనం చేసి గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.


మరిన్ని వార్తలు