కరువుపై చేతులెత్తేసిన రేవంత్!
- మన నీళ్లు చంద్రబాబుకు గిఫ్ట్ ఫ్యాక్
- రైతులు అల్లాడుతుంటే సీఎం అచేతనం
- నవంబర్ వరకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి): కరువును ఎదుర్కోవడంలో సీఎం రేవం త్(CM Revanth) విఫలమయ్యారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత(Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha) మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు, రైతులు కరువుతో అ ల్లాడుతుంటే ముఖ్యమంత్రి అచేతన స్థితిలో ఉన్నారని.. వరుణయా గం చేసి వారి ఖర్మ అన్నట్టుగా చేతులు దులుపుకున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలంగాణ నీళ్లను గిఫ్ట్ ప్యాక్ చేసి ఏపీ సీఎం చంద్రబా బుకు పంపిస్తున్నారని ఆరోపించారు.
బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడా రు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, కోటి 20 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల రైతులు పంటలను కాల్చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ప్రపం చ వ్యాప్తంగా సూపర్ ఎన్ నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముం దుగానే హెచ్చరించారని..
అయినా యం త్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయకుం డా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అడుక్కుంటారో, కొనుక్కుంటారో గానీ..పంటలు చేతికి రావాలంటే నవంబర్ నెలాఖరు వర కు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. తక్షణమే కరు వు మండలాలను ప్రకటించి, కేంద్ర సాయం అందేలా చేడాలని కోరారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వినియోగంలోనూ రేవం త్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు ఉందని హెచ్చరించారు. ముందస్తు చర్యల ను విస్మరించి, ఇప్పుడు కర్ణాటక నుంచి నీళ్లు తెస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి ప్రభుత్వం పెండింగ్ బిల్లులు రూ.60 వేల కోట్ల చెల్లించి ఉంటే కరెంట్ ఉత్పత్తికి సమస్య వచ్చేది కాదన్నారు.
తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలు దుర్భర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని.. కేంద్రం ఆదుకోవాలని, లేకపోతే మోదీని ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాలను తమ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులు సందర్శిస్తారని కవిత తెలిపారు. భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రిలో సీలింగ్ కూలిన ఘటన వీడియో పంపిన తమ కార్యకర్తను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. నిరసన తెలిపేందుకు గాంధీభవన్ వద్దకు వెళ్లిన మహిళా టీచర్లపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.