ఇండిగో విమానంలో బాంబు కలకలం... హై అలర్ట్
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలో బాంబు ఉందంటూ ఓ విద్యార్థిని సమాచారం ఇవ్వడంతో భద్రతా సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం విమానాన్ని ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ బే (Isolation Bay)కు తరలించారు. అక్కడ బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ (Dog Squad) సిబ్బంది తనిఖీలు చేపట్టారు. విమానంలో అనుమానాస్పద వస్తువుల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.