నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ

28-10-2026 | 02:54pm

కోనరావుపేట అక్టోబర్ 28 (విజయక్రాంతి): నిరుపేద వికలాంగుడికి అండగా నిలిచి, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్(Mechineni Srinivasa Rao Trust) సహకారంతో, కోనరావుపేట మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్(Chennamaneni Srikumar) స్కూటీని పంపిణీ చేశారు. నిరుపేదలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజా సేవే లక్ష్యంగా చెన్నమనేని శ్రీకుమార్ ముందుకు సాగుతున్నారని గ్రామస్థులు కొనియాడారు.

గ్రామంతో పాటు మండల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, రాజకీయాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టి నిరుపేదలకు అండగా నిలవాలని గ్రామ ప్రజల తరఫున కోరారు.ఈ కార్యక్రమంలో కొలనూరు గ్రామ సర్పంచ్ జలగం అరవింద్ రావు, ఉపసర్పంచ్ బిట్ల బాబు, వార్డు సభ్యులు తుమ్మల సురేష్, బోలగం కమలాకర్, భాను, సింగిల్ విండో డైరెక్టర్ నుగురి గణేష్, తాళ్లపల్లి సతీష్ గౌడ్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు