చికిత్స పొందుతూ యువకుని మృతి

28-10-2026 | 03:27pm

లక్షెట్టిపేట, అక్టోబర్ 28 ( విజయక్రాంతి): మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి(Venkatapur village) చెందిన తిప్పని శేఖర్(Thippani Shekhar)(28) అనే యువకుడు అనారోగ్య కారణాలతో పురుగుల మందు సేవించి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్(SI Gopati Suresh) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు తన స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో(Gram Panchayat Office) ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడన్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో(Kidney problem) పాటు ఇతర అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతూ ఆసుపత్రుల్లో వైద్యం చేపించుకుంటూ మందులు వాడుతున్నట్లు తెలిపారు.

తనకు ఇంత చిన్న వయసులో ఇన్ని అనారోగ్య కారణాలేంటి అంటూ మనస్థాపం చెంది ఈనెల 23 న రాత్రి పంటలకు కొట్టే పురుగుల మందు సేవించాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదని, మృతుని తల్లి తిప్పని వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు