“వైభవ్ కప్ ఆఫ్ టీ కాదు”.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ Batting Positionపై చర్చ మొదలైంది. గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వైభవ్‌ను Number 3 Positionలో బ్యాటింగ్‌కు పంపడం సరైన నిర్ణయం కాదని భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ Experiment ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని విశ్లేషించాడు.
క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 180 Runs Targetను భారత్ 4 వికెట్ల తేడాతో ఛేదించింది. అయితే, ఆరో ఓవర్లో క్రీజులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా సరైన Timing కుదరకపోవడంతో ఇబ్బంది పడ్డాడని అశ్విన్ పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం Broadcasterతో మాట్లాడిన అశ్విన్.. వైభవ్ బ్యాటింగ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. యువ ఆటగాడి ప్రదర్శనను వెంటనే వైఫల్యంగా చూడటం తొందరపాటు అవుతుందని చెబుతూనే, మూడో స్థానంలో అతడు తన సహజమైన ఆటతీరును ప్రదర్శించలేకపోయాడని వివరించాడు. ఆడిన 8 బంతుల్లోనూ బంతిని గట్టిగా బాదేందుకు ప్రయత్నించాడని, ప్రశాంతంగా ఆడటంపై దృష్టి పెట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు. వైభవ్ క్రీజులో ఉన్న సమయంలో సీనియర్ బ్యాటర్ అతడికి సూచనలు ఇచ్చి ఉండాల్సిందని అశ్విన్ అన్నాడు. “Stay Calm, Watch the Ball” అనే విధంగా ప్రశాంతంగా ఉండి బంతిని గమనిస్తూ ఆడితే బాగుండేదని సూచించాడు. ఆరో ఓవర్లో బ్యాటింగ్‌కు రావడం వైభవ్‌కు అనుకూలమైన పరిస్థితి కాదని స్పష్టం చేశాడు. టీమిండియా ఇదే Opening Pairతో కొనసాగాలని భావిస్తే, అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉన్న సంజూ శాంసన్‌ను Number 3 Batterగా పంపడం మంచి నిర్ణయం అవుతుందని అశ్విన్ సూచించాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్ల Batting Orderను నిర్ణయించాలని అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా, భారత Middle Order బ్యాటర్ల ప్రదర్శనను అశ్విన్ ప్రశంసించాడు. తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రమన్‌దీప్ సింగ్ కీలక సమయంలో మంచి ఆటతీరు కనబరిచారని కొనియాడాడు. మొత్తంగా భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించినా.. వైభవ్ సూర్యవంశీకి సరైన Batting Position ఏదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాబోయే మ్యాచ్‌ల్లో టీమ్ మేనేజ్మెంట్ అతడికి ఎలాంటి అవకాశం ఇస్తుందో చూడాలి.